30, మార్చి 2011, బుధవారం

కవిరాజు త్రిపురనేనివిశిష్టత. =

త్రిపురనేని రామస్వామి భావపరిణామం
కవిరాజదర్శనం నుండి

కవులనేకులుగా వున్నారు. అద్దంకి శాసన కాలం నుంచి  కవులున్నారు. తెలుగు కవులలో నాటినుండి నేటి వరకు స్వంత కావ్యాలను వ్రాసినవారు అరుదు. అనువాదములనో, ఆశ్ఛాదనములనో, కథలపుణికి పుచ్చి కల్పనలను అల్లుటతోనో కవుల ప్రతిభావ్యుత్పత్పులు పరిఢవిల్లుతీ వచ్చినవి.
రామాయణ భావుకులు, భారత భావుకులు, భాగవత భావుకులు, కాళిదాస భారతేత్యాది భావుకులతో తెలుగు సాహిత్యం నిండి కూర్చుంది. ఈ పెద్ద కృతులు పోగా, వుపాఖ్యాన పెంపరిక కృతులు జాస్తి కావొచ్చినవి.
మొత్తముమీద అనుకరణకు, అనువాదాలకు వున్న విలువ స్వంత కృతులకు లేదు. స్వంత కృతులు లేని కారణం చేత అట్లు జరిగినది.
ముక్తక కవులలో భావుకత కలదు కాని, అది పరిణతి చెందిన రీతి కాదు. శతక కవిత ముక్తకవిత. శతక కవులలో సాంఘిక భావుకులు కలరు. శతకాలను కావ్యాలనుగా యెంచకపోయిరి.
వర్తమానాంధ్రలో చారిత్రక పురుషుల గాథల చుట్టూ కావ్యాలు జాస్తిగా వచ్చినవి. ఇది జీవిత కథల సాహిత్యం. యివి పోతే సమాజాన్ని వుత్తేజపరచగలిగి, ఘూర్ణంపగలిగి, పూర్వాపరాల సమన్వయాభావం కలిగి, నూతన భావ పరిధుల్ని కల్పన జేయగల సాహిత్యం కొరవడింది. సాహిత్యంలో అవ్యవస్థ మేర్పడింది. కవితా ప్రతిభ గల్గి, విషయ గర్భితమై, వుత్పన్నతాశక్తి కల్గిన సాహిత్యం చాలా తక్కువ.
ఆ తక్కువగావున్న వున్నత కోవలోని సాహిత్యాన్ని యెక్కువగా సృష్టించినవాడు త్రిపురనేని రామస్వామి. అందులకే అతడు కవిరాజు.
కవిరాజు కవితలు భావప్రధానాలు. కవితకు నిలయాలు. రచనలో ఆయన ఆగర్భ శ్రీమంతుడు. ఆద్యంతాలు భావముమించు శైలితో, శైలినిమించు భావంతో నిండారి, పింపిసలాడుతూ వుంటవి. ఈ మాదిరి సాహిత్య మల్లినవారు లేరు. అందుకేవారు భావవిప్లవ కవులు.
వీరి రచనలకు పౌరాణిక, చారిత్రక, నైతికరంగాల్లో భావుకతలు కలవు. అది కురుక్షేత్రంగాని, శంబుక వధగాని, సూతపురాణములుగాని, ఖూనీగానీ, భగవద్గీతగానీ, కుప్పుస్వామి, ధూర్త మానవాశతకాలంగాని, నరకంగానీ, అంపకం గానీ – మరేదైనా సరే – పై నాలుగు భావరీతులు, యేకంగా గానీ, కలగాపులగంగాగానీ త్రిపురనేనిలో తాండవిస్తవి.
పురాణకథల్లో – కురుపాండవులు, రాముడు, ప్రహ్లాదుడు, కృష్ణుడు, ఏకలవ్యుడు మొదలైనవాటిల్లో పాతపురాణాల్లో కనబడే పక్షంగాక, అందులో తక్కువగా, నీచంగా చూడబడే పక్షంవైపు కవి బూగ్గి, పురాణాల్లో మెచ్చుకోబడే వారిలోకన్నా, వారిలోనే మకచి హెచ్చుగా వున్నదని, రెండోవైపు కథను చూపుతారు. విలువ ప్రధానాశ్రయంగా తీసుకొన్నారు.
చరిత్రాంశంగా పురాణాలు నిలవవు. రామాయణ, భారత గాథల కాల నిర్ణయాలు చేయటంలో రామస్వామిగారు నాటిక దొరికిన చారిత్రక పరిశోధనా వరవడిలోనే పయనించారు. కావ్యగత అంశాల్నీ గ్రహించారు. అంతేకాక, రామాయణగాథ యావత్తూ ఆర్య ద్రావిడ (లేక, వైష్ణవ, శైవ) ఘర్షణగా గ్రహించారు. భారత, భాగవత కృష్ణుని ద్రావిడత్వాన్ని వుగ్గడించారు. వైష్ణవ, శైవ పోరాటాలే పలనాటి చరిత్రకూ మూలకందంగా చూపారు. ఉత్తరాది కథలకు ప్రతిగా స్వీయదేశ కథను లేవదీసి, సామాన్యులను చిత్రించి, చరిత్రకు కవితావేశాన్ని కల్పించి, సాంఘికతలను వెలార్చారు.
కవిరాజులో సాంఘిక భావుకత అన్ని కావ్యాల్లో కనబడుతుంది. అది ఆయన రచనలోని విశిష్టత. ఆ సాంఘికతలో విలువలు కట్టగల గుణంకోసం, కార్యకారణ సంబంధంకోసం దేవులాడతాడు. నైతికతలు హేతుభావంతో చూడగలిగాడు. పాతపురాణ వైరం, వేదాలమీద మొదట్లో ఆధారపడి రానురాను వాటినీ కాదనటం, మామూలు దేవుళ్ళను, ఈసడించినా ఆదిలో కనబడే పరతత్వమహత్వాన్ని చూచిన భావం పూర్తి నాస్తికంలోకి పరిణతి వారటఁ ప్రాయికమైన హేతువాద వివేశనలు, తెలుగు నుడికారంతో కమ్మని కవిత్వాన్ని విమర్శలో అల్లగలగటం అనేవి కవిరాజులో ముఖ్యంగా గమనించదగ్గ ఐదు గుణాలు. యివి వారి భావాలు. కవిరాజు ప్రభావాలు, పరిణామశైలిలో పరిణతి నొందినవి.
పారపురాణ వైరం, పురాణ స్మృతి యితిహాసాల బండారాన్ని ఆంధ్రలో తరచి, తెరచి చూపినవాడు కవిరాజు. రూపాయికి రెండు ప్రక్కలున్నవని నిరూపించి, రెండవప్రక్క చూపించి, యధార్థాన్ని గ్రహించమని ఆవేదనలను లోకానికి నివేదించినాడు రామస్వామి. ఈయన భావుకతలో యిది అగ్రగణ్యమైనది.
వేద ప్రమాణం, మొదట్లో స్మృతి పురాణేతిహాసాలను కాదన్న రోజుల్లో (కురుక్షేత్రం, శంబుకవథ, సూతపురాణం) వైదిక ప్రామాణ్యతను అంగీకరించే భావాలు కలవు. వేద ప్రామాణ్యాన్ని అంగీకరిస్తే సభకు వస్తానంటాడు శంబుకర్షి. కాని, భగవద్గీతలో పాత భగవద్గీత డుల్లిపుచ్చబడింది, వేదాలసారం వుపనిషత్తులు, ఉపనిషత్తుల సారం గీతగా యెంచబడు లోకభావనను కాదని త్రోసివేసినాడు. గీతను గిరాటు వేసి కొట్టిపారేశాడు. ఖూనీలో వేనుడు ఆ వైదిక కర్మమన్న పొరపాటున నేనియు మెచ్చని స్థితికి వచ్చాడు. వేనుడు కవిరాజు. వేనుని వాదన కవిరాజు భావాలు, కవిరాజు భావపరిణామాన్ని పొందినవైనం వేదపరంగా చూడవచ్చు.
దేవుడు కవిరాజు ఆదిలో నాస్తికుడు కాదు. అనేకులైన దేవుళ్ళు లేకున్నా ములకారణమైన మహత్తర తత్వమేదో కలదన్న భావం సూతపురాణంలో కలదు. అది కవిరాజుకు దైవవాదిగా చేయకపోయినా, నాస్తికుడు కాదు. ప్రకృతివాది కావచ్చు. కాని ఖూనీలో వేనుని పాత్ర ద్వారానూ, పీఠికలోనూ సంపూర్ణమైన, స్పష్టమైన రీతిని వారి నాస్తికతను వెలార్చాడు. ఖూనీ నాటికి కవిరాజు పరిణతి చెందిన నాస్తికుడు.
హేతువాదం కవిరాజు పురాణ వైరాన్ని పాటించినప్పుడు నైహిలిస్టుగా, ఐకనోక్లాస్ట.దా వున్నాడు. పాత దానిమీద అనుమానాన్ని పుట్టించి, పాత మానసిక పౌరాణిక చిత్రాలను ప్రజల్లో పగులగొట్టివేశారు. సూత పురాణాల నుండి గీతకు, ఖూనీకి వచ్చేసరికి, కవిరాజులో హేతువాదం ప్రకటితమై వెన్ను ముదిరినది. ఖూనీ పీఠికలు, గీతా భూమికలు దీనికి ప్రత్యక్షర నిదర్శనాలు. హేతువాదిగా మారే నాటికి నాస్తికుడుగా మారినారు.
సాంఘిక విమర్శ కవితలు – సాంఘిక దౌష్ట్యాలమీది దాడి, లోపాలనెత్తి చూపుట, విమర్శించి మరో మార్గాన్ని చూపుటలో కవిత్వస్థాయి కందుట కవిరాజు యేకైక విశిష్టత.
ఈ తీరు తెన్నులు పరిశీలిస్తే కవిరాజు త్రిపురనేని భావ పరిణామచ్ఛాయల్ని స్థూలరూపంలో గ్రహించవచ్చు.
By Avula Gopalakrishna murthy in memorial souvenir 1948



28, మార్చి 2011, సోమవారం

త్రిపురనేని రామస్వామి భావపరిణామం by AGK

త్రిపురనేని రామస్వామి భావపరిణామం


కవిరాజదర్శనం నుండి

కవులనేకులుగా వున్నారు. అద్దంకి శాసన కాలం నుంచి  కవులున్నారు. తెలుగు కవులలో నాటినుండి నేటి వరకు స్వంత కావ్యాలను వ్రాసినవారు అరుదు. అనువాదములనో, ఆశ్ఛాదనములనో, కథలపుణికి పుచ్చి కల్పనలను అల్లుటతోనో కవుల ప్రతిభావ్యుత్పత్పులు పరిఢవిల్లుతీ వచ్చినవి.


రామాయణ భావుకులు, భారత భావుకులు, భాగవత భావుకులు, కాళిదాస భారతేత్యాది భావుకులతో తెలుగు సాహిత్యం నిండి కూర్చుంది. ఈ పెద్ద కృతులు పోగా, వుపాఖ్యాన పెంపరిక కృతులు జాస్తి కావొచ్చినవి.

మొత్తముమీద అనుకరణకు, అనువాదాలకు వున్న విలువ స్వంత కృతులకు లేదు. స్వంత కృతులు లేని కారణం చేత అట్లు జరిగినది.
ముక్తక కవులలో భావుకత కలదు కాని, అది పరిణతి చెందిన రీతి కాదు. శతక కవిత ముక్తకవిత. శతక కవులలో సాంఘిక భావుకులు కలరు. శతకాలను కావ్యాలనుగా యెంచకపోయిరి.
వర్తమానాంధ్రలో చారిత్రక పురుషుల గాథల చుట్టూ కావ్యాలు జాస్తిగా వచ్చినవి. ఇది జీవిత కథల సాహిత్యం. యివి పోతే సమాజాన్ని వుత్తేజపరచగలిగి, ఘూర్ణంపగలిగి, పూర్వాపరాల సమన్వయాభావం కలిగి, నూతన భావ పరిధుల్ని కల్పన జేయగల సాహిత్యం కొరవడింది. సాహిత్యంలో అవ్యవస్థ మేర్పడింది. కవితా ప్రతిభ గల్గి, విషయ గర్భితమై, వుత్పన్నతాశక్తి కల్గిన సాహిత్యం చాలా తక్కువ.
ఆ తక్కువగావున్న వున్నత కోవలోని సాహిత్యాన్ని యెక్కువగా సృష్టించినవాడు త్రిపురనేని రామస్వామి. అందులకే అతడు కవిరాజు.
కవిరాజు కవితలు భావప్రధానాలు. కవితకు నిలయాలు. రచనలో ఆయన ఆగర్భ శ్రీమంతుడు. ఆద్యంతాలు భావముమించు శైలితో, శైలినిమించు భావంతో నిండారి, పింపిసలాడుతూ వుంటవి. ఈ మాదిరి సాహిత్య మల్లినవారు లేరు. అందుకేవారు భావవిప్లవ కవులు.
వీరి రచనలకు పౌరాణిక, చారిత్రక, నైతికరంగాల్లో భావుకతలు కలవు. అది కురుక్షేత్రంగాని, శంబుక వధగాని, సూతపురాణములుగాని, ఖూనీగానీ, భగవద్గీతగానీ, కుప్పుస్వామి, ధూర్త మానవాశతకాలంగాని, నరకంగానీ, అంపకం గానీ – మరేదైనా సరే – పై నాలుగు భావరీతులు, యేకంగా గానీ, కలగాపులగంగాగానీ త్రిపురనేనిలో తాండవిస్తవి.
పురాణకథల్లో – కురుపాండవులు, రాముడు, ప్రహ్లాదుడు, కృష్ణుడు, ఏకలవ్యుడు మొదలైనవాటిల్లో పాతపురాణాల్లో కనబడే పక్షంగాక, అందులో తక్కువగా, నీచంగా చూడబడే పక్షంవైపు కవి బూగ్గి, పురాణాల్లో మెచ్చుకోబడే వారిలోకన్నా, వారిలోనే మకచి హెచ్చుగా వున్నదని, రెండోవైపు కథను చూపుతారు. విలువ ప్రధానాశ్రయంగా తీసుకొన్నారు.
చరిత్రాంశంగా పురాణాలు నిలవవు. రామాయణ, భారత గాథల కాల నిర్ణయాలు చేయటంలో రామస్వామిగారు నాటిక దొరికిన చారిత్రక పరిశోధనా వరవడిలోనే పయనించారు. కావ్యగత అంశాల్నీ గ్రహించారు. అంతేకాక, రామాయణగాథ యావత్తూ ఆర్య ద్రావిడ (లేక, వైష్ణవ, శైవ) ఘర్షణగా గ్రహించారు. భారత, భాగవత కృష్ణుని ద్రావిడత్వాన్ని వుగ్గడించారు. వైష్ణవ, శైవ పోరాటాలే పలనాటి చరిత్రకూ మూలకందంగా చూపారు. ఉత్తరాది కథలకు ప్రతిగా స్వీయదేశ కథను లేవదీసి, సామాన్యులను చిత్రించి, చరిత్రకు కవితావేశాన్ని కల్పించి, సాంఘికతలను వెలార్చారు.
కవిరాజులో సాంఘిక భావుకత అన్ని కావ్యాల్లో కనబడుతుంది. అది ఆయన రచనలోని విశిష్టత. ఆ సాంఘికతలో విలువలు కట్టగల గుణంకోసం, కార్యకారణ సంబంధంకోసం దేవులాడతాడు. నైతికతలు హేతుభావంతో చూడగలిగాడు. పాతపురాణ వైరం, వేదాలమీద మొదట్లో ఆధారపడి రానురాను వాటినీ కాదనటం, మామూలు దేవుళ్ళను, ఈసడించినా ఆదిలో కనబడే పరతత్వమహత్వాన్ని చూచిన భావం పూర్తి నాస్తికంలోకి పరిణతి వారటఁ ప్రాయికమైన హేతువాద వివేశనలు, తెలుగు నుడికారంతో కమ్మని కవిత్వాన్ని విమర్శలో అల్లగలగటం అనేవి కవిరాజులో ముఖ్యంగా గమనించదగ్గ ఐదు గుణాలు. యివి వారి భావాలు. కవిరాజు ప్రభావాలు, పరిణామశైలిలో పరిణతి నొందినవి.
పారపురాణ వైరం, పురాణ స్మృతి యితిహాసాల బండారాన్ని ఆంధ్రలో తరచి, తెరచి చూపినవాడు కవిరాజు. రూపాయికి రెండు ప్రక్కలున్నవని నిరూపించి, రెండవప్రక్క చూపించి, యధార్థాన్ని గ్రహించమని ఆవేదనలను లోకానికి నివేదించినాడు రామస్వామి. ఈయన భావుకతలో యిది అగ్రగణ్యమైనది.
వేద ప్రమాణం, మొదట్లో స్మృతి పురాణేతిహాసాలను కాదన్న రోజుల్లో (కురుక్షేత్రం, శంబుకవథ, సూతపురాణం) వైదిక ప్రామాణ్యతను అంగీకరించే భావాలు కలవు. వేద ప్రామాణ్యాన్ని అంగీకరిస్తే సభకు వస్తానంటాడు శంబుకర్షి. కాని, భగవద్గీతలో పాత భగవద్గీత డుల్లిపుచ్చబడింది, వేదాలసారం వుపనిషత్తులు, ఉపనిషత్తుల సారం గీతగా యెంచబడు లోకభావనను కాదని త్రోసివేసినాడు. గీతను గిరాటు వేసి కొట్టిపారేశాడు. ఖూనీలో వేనుడు “ఆ వైదిక కర్మమన్న పొరపాటున నేనియు” మెచ్చని స్థితికి వచ్చాడు. వేనుడు కవిరాజు. వేనుని వాదన కవిరాజు భావాలు, కవిరాజు భావపరిణామాన్ని పొందినవైనం వేదపరంగా చూడవచ్చు.
దేవుడు కవిరాజు ఆదిలో నాస్తికుడు కాదు. అనేకులైన దేవుళ్ళు లేకున్నా ములకారణమైన మహత్తర తత్వమేదో కలదన్న భావం సూతపురాణంలో కలదు. అది కవిరాజుకు దైవవాదిగా చేయకపోయినా, నాస్తికుడు కాదు. ప్రకృతివాది కావచ్చు. కాని ఖూనీలో వేనుని పాత్ర ద్వారానూ, పీఠికలోనూ సంపూర్ణమైన, స్పష్టమైన రీతిని వారి నాస్తికతను వెలార్చాడు. ఖూనీ నాటికి కవిరాజు పరిణతి చెందిన నాస్తికుడు.
హేతువాదం కవిరాజు పురాణ వైరాన్ని పాటించినప్పుడు నైహిలిస్టుగా, ఐకనోక్లాస్ట.దా వున్నాడు. పాత దానిమీద అనుమానాన్ని పుట్టించి, పాత మానసిక పౌరాణిక చిత్రాలను ప్రజల్లో పగులగొట్టివేశారు. సూత పురాణాల నుండి గీతకు, ఖూనీకి వచ్చేసరికి, కవిరాజులో హేతువాదం ప్రకటితమై వెన్ను ముదిరినది. ఖూనీ పీఠికలు, గీతా భూమికలు దీనికి ప్రత్యక్షర నిదర్శనాలు. హేతువాదిగా మారే నాటికి నాస్తికుడుగా మారినారు.
సాంఘిక విమర్శ కవితలు – సాంఘిక దౌష్ట్యాలమీది దాడి, లోపాలనెత్తి చూపుట, విమర్శించి మరో మార్గాన్ని చూపుటలో కవిత్వస్థాయి కందుట కవిరాజు యేకైక విశిష్టత.
ఈ తీరు తెన్నులు పరిశీలిస్తే కవిరాజు త్రిపురనేని భావ పరిణామచ్ఛాయల్ని స్థూలరూపంలో గ్రహించవచ్చు.

25, మార్చి 2011, శుక్రవారం

సాహిత్య మాగానుల్లో ఏటుకూరి వెంకట నరసయ్య

ఏటుకూరి వెంకట నరసయ్య


(స్మారక సంచిక నుండి-1948)

ఏటుకూరి ఆంధ్ర సాహిత్యలోకానికి చిరపరిచితులు. ఆంధ్ర ప్రజల ఆదరాభిమానములను పొందినవారు. ఇరవై సంవత్సరాలు తెలుగు సాహిత్య మాగానుల్లో విహరిస్తూ, పట్టుతప్పని స్వాతంత్ర్య గరిమజూపి తెలుగు భాషకు కొత్తరికాన్ని తెచ్చిపెట్టిన నిర్భయ పలవాటికవి.
నరసయ్య విశిష్టకవి. భాషాపాండిత్యం, కవితా హృదయం సమపాళ్ళుగా పొదుపు చూపిన పండితకవి. కవి పండితుడు. భావమందు శైలియును, భాసుర శైలిని మించు భావము కలిగినవాడు. అతడొక కావ్య తపస్వి. చేతికివచ్చినదల్లా వ్రాయక, ఒక నియమం. ఒక భావం, ఒక ప్రణాళిక కలిగించాడు. ఒక్కొక్క కృతిని ఒక్కొక్క రీతికి నిగళసూత్రంగా చిత్రించి, వెలార్చినవాడు.
సుద్దులతో సాహిత్యంలో అడుగుపెట్టి, నీతిమంజరి రచించి, రైతుగాథల్లో శ్రావ్య కవితాగాన స్రవంతుల నుంచి క్షేత్రలక్ష్మిని నిగదించి, ప్రేమమయ జీవితాన్ని ఆకాంక్షించి, ప్రేమాలోకం నిలకడగల నుగ్గుదేరిన తెనుగునుడికారంతో నింపివేసి, కథలో పాత్రల్లో, కవిత్వంలో అందెవేయించి, .మగువ మాంచాల”, “నాయకురాలు”, “రుద్రమలను స్త్రీత్వప్రాతినిధ్య ప్రతిభా విభాసినులనుగాయేర్చి, కూర్చి తెలుగు తల్లుల మగటిమ చూపాడు.
సంస్కృతంలో నరసయ్య, వరుసలుగా పరవళ్ళు త్రొక్కే రీతిలో రచన చేయగలిగిన సత్తాను చూపాడు.
కవిబ్రహ్మ తాను మాటిమాటికి పలనాటి వాడనన్న, అహం, మరచేవాడు కాదు. అందుకే పలనాడన్న దిగంత అని యెంతగానో దొర్లించేవారు.
పలనాటిని బయటికి లాగాడు. భారతాన్ని లేవదీశాడు. అది కవిత్రయ భారతం. వాగమశాసనులు. కవిబ్రహ్మలు, ప్రబంధ పరమేశ్వరులు రచించినది, ఇది యేకైక కవి భారతం, తానే వాగను శాసనునిగా, ప్రబంధ పరమేశ్వరునిగా కవి బ్రహ్మగా రూపొంది, విజ్జి రాల్చినాడు. తిక్కయజ్వ తానై రహిమై వెలార్చినాడు.
అది వుత్తరాదివారిగాథ, యిది తెలుగు జోదుల వీరగాథ, అందుకే వీరభారతం.
కవి బహుముఖ పాండిత్యాన్ని ప్రకర్షించటమేకాక, తన సాంఘికాభిరుచుల్ని మనోజ్ఞ రీతుల్లో త్రివేణిగా చూపాడు.
అసలు తిక్కనదొట్టి నేటివరకు లేని తెలుగుదనాన్ని తెలుగు భాషలో చూపిన సాహసాంకుడు. ప్రాత క్రొత్తలందుల్లముసేర్చి, తనకొల్లనిదేమి.... లేక రసస్వరూపాన్ని, శబ్ద స్వరూపాన్ని నూతనాకృతిలో నిగదించాడు. తెలుగుకు అమూల్యమైన సేవ చేశాడు. ఆయన కావ్యాకృతిలోకి తెచ్చిన పదాలు, చేర్చిన మాటలు తండోప లబ్ధిగావున్నవి. అవి ఆయన విశిష్టతను చాటగలవు. జీవద్భాషగా తెలుగుకు పరిపుష్టి, తుష్టికూర్చినాడు మన సరసకవి.
సమకాలిక సాహిత్యరంగంలో నాలుగు కాలాలపాటు నిల్వగల్గి రచనలు చేసిన వారిని వేళ్ళమీద లెక్కించవచ్చును. అందులో వేంకటనరసయ్య ఒకరు. వారి కావ్యరచనా విశ్వాసాన్ని మగువ మాంచాలలో చూడవచ్చును. మాంచాల మనోజ్ఞమైన సృష్టి. వీరభారతం పెద్దకోవకు చెందిన రచన. ప్రణాళికాబద్ధ రచన. అలరాజు రాయబారంలో తిక్కన పోకడలను, తిక్కన రచనలుగా, ఆయీ కవిబ్రహ్మల భాషా సామ్రాజ్య సామ్యాన్ని చూపాడు. మరెన్నో ప్రణాళికలు కలవు. తీరని రీతిలో కవి అంతరించటం తెలుగు సాహిత్యానికే కుంటుతనం వచ్చింది. స్నేహితుడుగా వేంకట నరసయ్య వెన్నపూసలాంటి వాడు. వాక్కులో కాఠిన్యత లేకపోలేదు,. ఆయన వీరభారతం అసమగ్రంగానే వుంది. కవిబ్రహ్మకు వుద్దీ యెప్పుడు వచ్చి, యీ పురాణభారం వహిస్తాడో చూడవలసి వుంది.
Avula Gopalakrishna Murty contributed this tribute in 1948 to Etukuri Venkatanarasaiah

24, మార్చి 2011, గురువారం

సాహిత్యంలో సాంఘిక విప్లవం

సరియైన మార్గాన్వేషణ

శ్రీ గౌరిబోయిన పోలయ్య (ఇంకొల్లు, గుంటూరుజిల్లా)గారి
పిలకరాయుళ్ళు గ్రంథానికి పరిచయం

యే యుగంలోనైనా చూడండి సాంప్రదాయజ్ఞులకు సాంప్రదాయ వ్యతిరేకులకు వైషమ్యం తప్పదు. ఒకరు సనాతనులైతే (లౌకికార్థంలో) ఇంకొకరు అధునాతనులౌతారు. ఒకరు పూర్వులైతే యింకొకరు నవ్యులౌతారు. యీ వాదన నాలుగు కాలాలపాటు నిలిచింది గనక మమ్ముల్నే నమ్మం వింటారు  ఒకరు. పూర్వ విజ్ఞానానికి ఆధునిక విజ్ఞానాన్ని మేళవించాము గనుక మాదే మేలంటారు రెండోవారు.

ఇటువంటి వరిపిడి లేనిదే శోభలేదు. ఆ శోభను ఆకాంక్షించి గూడా దూరంగా వుండేవారు జాస్తి. దానికోసం యుద్ధరంగంలో దిగేవారు తక్కువ. అందులోనూ విజ్ఞాన శాస్త్రీయ దృష్టితో కదిలేవారు మరీ తక్కువ.

...భారతవర్షకో పతివ్రతాకా ఘమండ్ హై... అని ఒక వంగీయుడు. ఆధ్యాత్మిక వాదమే మన విశిష్టతగా చదువుకున్న వాడూ, చదువుకోనివాడూ నోరూరకుండా నుడువుతారు. నాకు మాత్రం ఒక విశిష్టత కనబడుతుంది. పూర్వ భారతంలో వున్న 7,00,000 గ్రామాలకు కొంచెం దూరంలో యేడు లక్షల పల్లెలు ఉండటం మాత్రం విశిష్టతల తాతలాంటిది. ఇక రెండో విశిష్టత, జ్ఞానం పెరగదు అవటం. అందువల్ల ప్రపంచంలో యెవరు యేది యేమూల చెప్పినా యిదంతా మా వేదాల్లోనే వుంది అంటారు. కాని ఆ విషయాన్ని గురించి వారుమాత్రం ముందుగా చెప్పరు. ఇక మూడో విశిష్టత మన సాంప్రదాయాలు మనకు బాగా తెలియవు. అందువల్ల యీ చిక్కులు వచ్చినై యంటారు. తెలియ చెప్పటానికేమీ సరియైన మార్గాన్వేషణ చెయ్యరు. నాలుగోది కర్మభాగానికిచ్చిన ప్రాముఖ్యత జ్ఞాన భాగానికివ్వరు. అంటే ఆచరణ కిచ్చినంత పాత్ర ఆలోచనకివ్వరు. ఫలితం ఆలోచనారహిత ఆచరణ మిగిలిపోవటం. అయిదో విశిష్టత, చెప్పేదానికి చేసేదానికి వున్న వ్యత్యాసం విపరీతంగా వుండటం.

ముఖ్యంగా ఈ విశిష్టభావాల్ని మార్చుకోవటం గాని, మానుకోవటంగాని చెయ్యకపోతే మనదేశానికి మోక్షంలేదు.

అదీగాక ప్రాచ్య సంస్కృతిలోని యెన్నో విషయాలు అబద్ధాలమీద, అసత్యాల మీద ఆధారపడివున్నై. వాటిని దులపాలి. పాత నీరు పోనిది, పాత రక్తం వీడంది క్రొత్తవి రావటానికి సావకాశం లేదు. అందుకని పాత భావాల్ని, ఆ పాత భావాలమీద ఆధారపడి నిలచిన సౌధాల్ని డుల్లిపుచ్చంది క్రొత్తకు తావులేదనే భావంతో వివిధ దేశాల్లో వివిధ రీతుల్లో వుద్యమాలు రేగినై రష్యాలో రేగిన, వుద్యమాన్ని ....నైవిలిస్టు వుద్యమం... అన్నారు. దాని మాదిరి ఉద్యమాలు ఇతర దేశాల్లోనూ వచ్చినై. మన దేశంలో రామమోహనరాయ్ వాళ్ళతో ప్రారంభమై యం.యన్.రాయ్.తో ఉచ్ఛస్థితికి వచ్చిన యీ భావవిప్లవ వుద్యమంలో చిలవలు పలవలు యెన్నోవున్నై.


సాంఘిక విప్లవాభిలాషలో నున్నవారు ఈనాటి పెండ్లి పద్ధతి మార్చాలని, క్రతువులు వర్జించాలని, కేవలం పాతకు పిలకగా మాత్రమే బ్రతకకూడదని అందరూ అంగీకరిస్తారు. సాంఘిక సముద్రంలో భావవిప్లవాన్ని లేవతీయటానికి ఇటువంటి అలలు యెన్నో చేరాలి, ఈ చేరిన అల దానికెంతైన అవసరం. అవసరం అంతస్తును బట్టి వుంటుంది. అవసరం నెమ్మదిగా ప్రయోజనంగా మారుతుంది. ప్రయోజనం వుపయోగంగా మారుతుంది. ఉపయోగం శ్రేయస్సుగా మారుతుంది. అదేగదా కావ్యలక్షణంగా గ్రహించమని పెద్దలు
Avula Gopalakrishna murty`s preface
.చెప్పింది

23, మార్చి 2011, బుధవారం

నవ్యసిద్ధాంతానికిప్రచారం=రైతువిప్లవం

కావ్యలోకం


(శ్రీ అమ్మిశెట్టి లక్ష్మయ్య (తణుకు) గారి రైతుకళ్యాణమునకు పీఠిక 1948)


సాహిత్యం మానవ విక్రీడల్లో ప్రధానాంగం. అందువల్ల మానవ సమాజంలో యేర్పడ్డ గడ్డు సమస్యలు, సమస్యా పరిష్కార మార్గాలు సాహిత్యంలో ప్రతిఫలిస్తుంటై. అందుకనే కొందరు విమర్శకులు సాహిత్యాన్ని జీవిత ప్రతిబింబంగా భావిస్తారు. మానవ జీవితంలో క్లిష్టపరిస్థితులు అప్పుడప్పుడూ వస్తూవుంటై, ఆకాలంలోని సాహిత్యంలో ఆ క్లిష్టపరిస్థితి ప్రతిస్ఫుటంగా కనబడుతుంది. సంఘం, మానవ సమాజం ఒక యుగంలో నుంచి మరో యుగంలోకి మారేటప్పుడు ఈ స్థితి మరీ విశేషంగా కనబడుతుంది.
మానవ  సమాజం వీలువెంట తిరుగాడుతూ, గుడారాలెత్తుకుంటూ పోతూవున్న రోజుల్లో గేయవాఙ్మయం వున్నట్లు, ఈ చలనదశపోయి, స్థిరనివాసాలేర్పరచుకున్న తర్వాత, చలన యుగంలో యేర్పడ్డ అనుభవాల్ని ఆనాటి వాస్తవికతకు ముడివేసి, సాహిత్యాన్ని కూడా స్థిరరూపంలో నిర్మించ ప్రయత్నించినట్లు జాతుల చరిత్రలవల్ల తెలుస్తుంది.
వైదిక వాఙ్మయానికి ముందున్న సాహిత్యం మీద వైదికులు తిరగబడి, అంతకుముందు లేని మత సాహిత్యాన్ని కుమ్మివేశారు. వేదమతం మీద, ఆ సాహిత్యం మీద తిరుగుబాటుభాగవత మతం పేరుతో పశ్చిమ ఇండియాలో తలెత్తి, నూత్న వాఙ్మయానికి దోహదమిచ్చింది. అంతకు ముందు అతీతుడైన దేవుణ్ణి కొంత సాఫీ చేసి, పురుషోత్తముడుగా చిత్రింప మొదలుపెట్టారు. ఇంతలో తూర్పు ఇండియా వివిధ శాఖలు వైదికం మీద రేగినై, అందులోకల్లా బౌద్ధమతం ముఖ్యమైనది. వైదికమతాన్ని కూకటి వ్రేళ్ళదాకా, గూటికట్టకానా పెకలించి ఝమాయించింది. ఈ ఝమాయింపు సాహిత్యంలోకీ దూకింది, కొత్త సాహిత్యం రేకెత్తింది. వైదికాన్ని తోలి కొట్టింది.
ఈ స్థితిలో దక్షిణ ఇండియాలో శంకరాదులు బయలుదేరి బౌద్ధాన్ని డొల్లిపుచ్చ ప్రయత్నించారు. పురిటిగడ్డలో ఆస్కారం తగ్గి బౌద్ధం ప్రాచ్యదేశాలకు పాకింది, తిరిగి వైదికదృష్టి పునరుద్దీపితం చేయబడింది. ఈ దుమారంలో కొత్త సృష్టి సాహిత్యంలో రేగింది,. వైదికానికి చిలవలు పలవలు తొడిగినై. పిలకలు మొలిచినై. వేదాలకు వుపవేదాలు, శ్రుతులకు మార్పు ధర్మాలుగా స్మృతులు పుట్టినై. పంచమవేదాలు, పురాణాలు తంతోపలబ్ధిగా త్రొక్కిసలాడుకొంటూ చెలరేగినై.
అంతగా చెలరేగిన వైదిక మరుత్తు మహమ్మదీయ దాడులవల్ల కొంత, ఇంగ్లీషువారి రాకతో మరికొంత వికావికలైంది. చెల్లాచెదరైంది. వైదిక శాస్త్రదృక్పథానికి యెదురుగా ఒకవైపు అద్వైత భావాలతో మహమ్మదీయ క్రైస్తవమతాలు, మరోవైపున విజ్ఞాన శాస్త్రదృక్పథం జోడింపబడటంతో వైదికదృష్టి సన్నగిల్లింది. యిక నూతనచ్ఛాయలు దేశసాహిత్యంలో నరనరాలకు యెగబ్రాకి కొత్త శోభల్ని వెల్లివిరిసినై. కావ్యాల్లో మార్పు, కథల్లో మార్పు, కల్పనల్లో మార్పు, దృష్టిలో మార్పు, నడకలో మార్పు యెటుజూచినా మార్పు విశిష్టలక్షణంగా తయారైంది. పాశ్చాత్యుల ఛాయలన్నీ సాహిత్యంలో ప్రతిఫలించినై.
తిరిగి, జాతీయత పేరుతో, ఆర్య సంప్రదాయాలు, ఆర్షక కథలు, ప్రాచీన ప్రాచ్యవిజ్ఞాన (1) వీచికలు, రుస రుస సాగ జొచ్చుచున్నవి. విదేశ భాషా, భావ, వస్తు, వస్త్ర నిషేధ నినాదాలతో యీ ప్రాచీన భావపునరుద్ధారకోద్యమం ప్రారంభమైంది. దినదినం ప్రవర్థమానమౌతున్నది. విజ్ఞానానికి, భావాలకు ప్రాచ్యప్రతీచీ భేదాలు కల్పన చేయబడుతున్నై. తప్పుడు యెక్కాలు అన్ని తరగతుల్లో అన్ని వేళల అన్ని శాఖల్లో ప్రబోధం చేయబడుతున్నై. చదువుకున్నది పనికిరాదని తేల్చుతున్నారు. చదువుకోనిది, చదువవలసినది పెద్దగా లేనిది చదువనారంభించుచున్నారు.
తిరిగి క్లిష్టపరిస్థితి వచ్చింది. పాతకొత్తల ఒరిపిళ్ళలో, ఆబోతుల మధ్య లేగలకాళ్ళు నలిగినట్లుగా పరిస్థితి, గతి దప్పి, స్థితి చెడి, శ్రుతి మించి చరిస్తుంది.
ఇదీ, యీనాటి పరిస్థితి.
II
ఈ పరిస్థితుల్లో మరచిన చదువులు మరల చదువు వారు హెచ్చుతున్నారు. మంచి చెడ్డల తారతమ్యం తెలియలేక, యే భావానికిగాని, యే వుద్యమానికిగాని యే యితర వుదాత్త ప్రయత్నానికి గాని సరియైన విలువ కట్టలేక సమాజంలో ఒకరకమైన నిస్తబ్ధత బయలుదేరుతుంది. దుమారానికున్న విలువ గౌరవం దేనికీ కనబడటంలేదు. శాస్త్రచర్చల్లో జూచినా రాజకీయరంగంలో పరికించినా, నాట్యరంగస్థలాల్లో తిలకించినా, సాహిత్యలోకంలో పర్యవేక్షించినా ఒకే ఒక గోల – గగ్గోలు, సంక్షోభం – గతితప్పిన నడక, మతికి స్థిమితం కూర్చని వరువడి.
మనకు ప్రస్తుత చర్చనీయాశం సాహిత్యలోకం గనక దానివరకే కొంత సింహావలోకనం తప్పనిసరి.
ఇంగ్లండులో 19వ శతాబ్దాంతంలో యేర్పడ్డ స్థితిగతులు మనకు దాదాపు యిప్పుడేర్పడుతున్నై. పద్యంపట్ల  పద్య కావ్యాలపట్ల ఆదరమే కాకుండా, అభిరుచి గూడా తగ్గిపోయింది. ఒక పత్రికలో ఒకటో రెండో పద్యవ్యాసాలు వేస్తే వాటిని తిప్పిపారవేయటం తప్ప చదివేవారు నూటికొకరుండరు. యిది అత్యత్తుక్తి కాదు. పద్యకావ్యాలు కొంత దుర్దశలో వున్నవని చెప్పక తప్పదు. పోనీ, గద్యకావ్యాలకు స్థానం యేర్పడిందా అంటే, ఆవేశం, వేడి పుట్టించే రచనలకున్న గౌరవం నిబ్బరంగా పనికివచ్చే సంగతుల్ని గురించి చెప్పే రచనకుండదు. కథకు, నవలకు, నాటికకు వున్న తాపు ఇతర సాహిత్య భాగాలకు లేదు. వీటిల్లో శృంగార రసానికి మించిన కామవిక్రీడలు రచనావస్తువులైతే మరీ మంచిదిగా వుంది. వీటికి తోడు మంచి సినీ బొమ్మలుంటే మరీ పసందు.
ఈ రకం గాక, రాజకీయ సంబంధ చదువరులు కొంతకు కొంత పెరిగారు. పోతే, మిగతా సాహిత్య రంగాల్లో కృషి చేసేవాళ్ళకు నిరుద్యోగం సమీపిస్తున్నట్లుంది.
ఇగీగాక, రచన యెంత క్లుప్తంగా, పొట్టిగా వుంటే, అంత మంచిదిగావుంది. దీర్ఘరచన దురూహ్యంగా మారిపోతుంది. కొంచెం ఆలోచన కదిలితే తప్ప అర్థంగాని రచనల్ని ముట్టేవాడు, వాటి వూసు యెత్తేవాడు లేకుండా పోతున్నారు.
ఈ స్థితి మారుతుందా? ఇంకా, వైపరీత్యస్థితికి జారుతుందా? అన్న ప్రశ్నలు సాహిత్యరంగంలో కనుపించే, కనుపించదలచుకునేవారందరూ యెదుర్కోవాలి. తగిన సమాధానం ఇచ్చుకోవాలి.
III
ఈ ప్రశ్నలకు ముందు కొంచెం మన ప్రాచీన సాహిత్యరంగ పర్యవేక్షణ అవసరం, సమంజసం గూడా.  తెలుగు భాష ఆర్యభాషా సంస్కృతుల సంపర్కంవల్ల కొంత వికృతి పొంది నడుస్తూ వుంది. ప్రాఙ్నన్నపార్యయుగంలో రగడలు, ద్విపద కావ్యాలుగా వాడుకలో వుండి. సారమతిం కవీంద్రులు ప్రసన్నకలితార్థ యుక్తిలో అరయ గల్గిన కావ్యాలతో, మృదుమధుర రసభావ భాసురనవార్థ వచనరచనా విశారదులైన మహాకవులతో పరిపుష్ఠి పొంది నన్నెచోడునిలో తెలుగు రూపంలో యెక్కువగా వుండి, నన్నయతో సంస్కృత భాషా భావాదులకు లోనై తెలుగు ఆఁధ్రమైపోయింది. స్వంత కృతులు లేని పురాణయుగంలో సౌష్ఠవం సంపాదించి, మధ్య యుగంలో రాజసదైవతముల మఘ్య రగడలో పడి, కథలు స్వంతములుగాని, కథలు అల్పములైన, కేవల కావ్యయుగమనదగు ప్రబంథ యుగంలో కచ్చువారి, 19వ శతాబ్దాంతము వరకు మందగించి, తిరిగి నవ్యాకృతులు పొడసూపగా, తిరిగి వివిధ రంగాల్లో కావ్యరచన చెలరేగి, అవధానాలధాటుతో భుజాస్ఫాలనలతో భావ కవిత్వ యుగంలోకి వచ్చి, ఇప్పుడు సంధియుగంలో సాహిత్యం తగులుకుంది.
19వ శతాబ్దాంతం నుంచి, కందుకూరి ప్రతిభ, గిడుగు వారి భాషాయుగస్థితి, త్రిపురనేని భావయుగస్థతి ప్రధానచ్ఛాయలుగా కనబడుతున్నై. యీ త్రివేణుల మధ్య యితర స్థితులు మున్కలు వారుతున్నై. భావకవిత్వంలో భాషా స్వాతంత్ర్యం హెచ్చుగాని, భావస్వాతంత్ర్యం అంతగా కనబడదు.
ఇప్పుడిప్పుడు రాజకీయాలే సాహిత్యరంగంలో చేరి ముఠాలు కడుతున్నై. రెండు యుద్ధాల మధ్యకాలంలో వచ్చిన మార్పుల్లోకల్లా విశేషమైన మార్పు.
IV
ప్రాఙ్నన్నపార్యయుగంలోని తెలుగు మాత్రా ఛందస్సు మీద నన్నయ తిరగబడి సంస్కృత సాంప్రదాయైక గణ ఛందస్సును తెచ్చిపెట్టి, తెలుగునకు సంస్కృతంలో వాగను శాసనం చేశాడు. పురాణయుగంలో అంగీకరించలేక, వ్యతిరేకించలేక, దైవకవిత్వం వదలలేక, కేవలం అదే వ్రాయలేక, శ్రీనాథుడు కొత్త పాతలకు సంధి పురుషుడుగా, వంతెనగా తయారై, దైవకవిత్వుడైన పోతనతో పోరు పెట్టుకున్నాడు.
ప్రబంథయుగంతో దైవకవిత్వం పోయి, రాజుల శృంగార కావ్యాలు, కేవల కల్పనకథలు వచ్చినై. కాని, భాషమీద కసరత్తులు జాస్తి అయినాయి. ప్రబంధ యుగం తర్వాత అంధకారం, తిరిగి అనువాద సాహిత్యం ప్రాయికంగా నాటకానువాదం – స్వంత కృతులు, కొంతకు కొంత గాసట బీసట. సాహిత్యం జనానికి ఎక్కువగా అందుబాటులోకి రావటం, అవధానాల వరవడి, వ్యావహారిక వాదుల శిష్టజనవ్యావహారికం తిరిగి అలజడి. తరుణోపాయంగా భావకవిత్వం, ఇప్పుడు, భావకవిత్వమూ నచ్చదు, పూర్వ మార్గాలూ నచ్చవు, సాహిత్యంలో రాజకీయాలు దూరినై. దానితో సాహిత్యం వర్గశ్రేయస్సుకేనని ఒకడు, సాహిత్యం దేశాభ్యున్నతికే నని యింకొకడు. కాదు, దేశమూ కాదు, వర్గమూ కాదు మానవకోటికంతకూ సాహిత్య రోచిస్సు చిమ్మాలని మరొకడు. యీ విధంగా రాజకీయ దుమారం సాహిత్యంలోకి మళ్ళింది.
వ్యావహారికం రూఢి అయింది. గ్రామ్యంలో ప్రయత్నం గూడా వుంది. ప్రయోజన సాహిత్యం వుండాలన్న కోర్కె పునరుద్ధరింపబడింది. సాహిత్యకక్షల్లో పద్యానికన్నా గద్యానికే వోటు పెరిగింది. గద్యంలో కూడా కథకు, నాటికకు, నవలకు డిమాండు జాస్తి. రచయితల్లో పాండిత్యం సన్నగిల్లింది. పాండిత్యం వున్నదనుకున్న చోట్ల వెర్రితలలేసింది. ఇది యీనాటి సాహిత్య రంగస్థితి.
V
పూర్వవాదనల్లో మంచిని గ్రహించి, మనకు యీ నాటి స్థితుల కవసరమైన మార్పులుపచరించి, సాహిత్యాన్ని నడుపుకోవాలని అందరూ అంగీకరిస్తారు. పూర్వం ధ్వని వాదులు, రసవాదులు వుంటే, యీనాడు ధ్వనిరసవాదులో, రసధ్వనివాదులో, ప్రయోజనవాదులో వున్నారు. హెచ్చుమంది ప్రయోజనవాదులు. ఈ ప్రయోజనవాదులకు ధ్వనితో కూడి, రసాత్మకమై, రమణీయార్థ ప్రతిపాదక శబ్దయుతమై యిష్టార్థ వ్యవచ్ఛిన్న పదావళితమై, కావ్యం వుండవచ్చు. కావ్యం, తేలికగా వుండి, సుబోధకంగా వుండాలని కోరతారు. కావ్యం కచ్చుపోతగా అష్టాదశవర్ణనయుతమై వుండాలనీ, ఫలానివారి జీవితాన్ని మాత్రమే వర్ణించాలనీ, కథావస్తువు యిదమిత్థమని నిర్ణయింపబడాలనీ వీరంగీకరించరు. ఒక రాజు కోసమో, ఒక పూజారికోసమో, ఒక ధనికుని కోసమో, కావ్యముండాలని వీరంగీకరించరు.  ఒక రాజు కోసమే వుండటం ఎంత తప్పో, ఒక కూలివానికోసమే వుండటం అంత తప్పు అని వీరివాదం. ఒక్క పూజారి కోసమే కావ్యం నిర్దిష్టం కావటం ఎంత తప్పో, ఒక దేశం కోసం వినిమయం కావటం కూడా అంతేనని వీరివాదన. ప్రతివస్తువును కొలిచేది, మానవునికి ఆ వస్తువువల్ల కలిగే ప్రయోజనాన్ని బట్టి అని వీరిఅభిమతం. ప్రయోజనవాదులు, ఆనందాన్ని గూడా ఒక ప్రయోజనంగా అంగీకరిస్తారు.
దేవుని పేరుతోగాని, దేశం పేరుతోగాని, వర్గం పేరుతోగాని,  ఆత్మార్పణను వీరు సహించరు. కావ్యకళ, చిత్రకళ, శిల్పకళ, సంగీతకళ వీటన్నిటిని కళాస్థానంలో అంగీకరింతురు. యే కళ గానీ అందులో ప్రాయికంగా కావ్యకళ జాతి మత వర్గబంధితం కాదని కారాదని, మానవతత్త్వద్యోతకంగా వుండాలని వీరి ఆచారం. కావ్యం గద్యపద్యాత్మకంద్విథా అని వీరంగీకరింతురు.
శ్రోతయొక్క రచయిత యొక్క అంతస్థునుబట్టి కావ్య ప్రయోజనాది గుణ గ్రహణ ఆధారపడి వుంటుందని, పైగా, శ్రోతయొక్క ఆనాటి మనస్థితిని బట్టి ఉంటుందని వీరంగీకరిస్తారు.
తత్త్వశాస్త్రాన్నీ, విజ్ఞాన శాస్త్రాన్ని జీవితంతో మేళవించి సమగ్రత్వాన్ని కావ్యాల్లో ప్రతిబింబింపచెయ్యాలనీ, ఈ ఆశయం, యే రూపంలోనైనా వుండవచ్చుననీ, సత్యాన్వేషణ, స్వాతంత్ర్యేచ్ఛలను హేతువాదం ద్వారా పరిపక్వం చేసి, మానవునిలో చేయటమే సాహిత్య పరమావధి అనీ భావింతురు. ఈ వాదనను నవ్యమానవ వాదమనిగాని, హేతువాదమార్గమని గాని, రినైజాన్సు పద్ధతని గాని, శాస్త్రీయ దృక్పథమని గాని వ్యవహరించవచ్చును.
VI
ప్రస్తుత కావ్యం వుభయ భాషాప్రవీణ, ప్రౌఢకవి అమ్మిశెట్టి లక్ష్మయ్యగారి రైతు కళ్యాణం, రైతు కావ్యం. ప్రౌఢకవిని గూర్చి 1943 జనవరిలో కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి నాతో ప్రస్తావిస్తూ, అనామికకు పీఠిక వ్రాయాలనీ, అస్వస్థతవల్ల వాయిదా వేశామనీ అంటూ, లక్ష్మయ్య సవ్యసాచి లాంటివాడన్నారు.
తర్వాత, 1947 డిసెంబరులో లక్ష్మయ్య కవిని పెంటపాడులో చూడటం, వారితో నాల్గునాళ్ళు గడపటం జరిగింది. అప్పటి నుండి వారికి నాకు సన్నిహితత్వమేర్పడింది. సిద్ధాంత సామ్యం గూడా కొంత  పొసగి నందున తమ కావ్యంలో నన్నూ చేర్చలన్న భావంతో, నన్నీ పనికి ప్రేరేపించినట్లు తోస్తుంది.
VII
కావ్య వస్తువు నూరేండ్ల నాటి గాథ, కష్టజీవికథ. కళా వాదులంగీకరించినా, లేకపోయినా, కవితాహిందోళ రాగమ్ములో పదునెక్కతగిన కావ్యవస్తువే.
ఈ కావ్యంలో కవి ధనిప్రతతికుచేష్టల వల్ల జాతి భేద సంస్థిత ఘన దుష్పలము వల్ల రైతు కష్టాల్ని కళాగతిలో వెలార్చారు. కుల ధనభేద దృక్పథము కూటికి పేదరికమ్ము గూర్చి ఈ ఇలపయి తాండవించినది యింతటచాలు నని కవి నిచ్చెన మెట్లలాంటి సంఘవ్యవస్థా న్యూనతాభావానికి స్వస్తి వాచకం పాడారు.
హల రేఖలో కుతూహల రేఖలు పెంచుకొంటూ రాయడు రెండు కుంచాల మెరక భూమిని రెప్పలాగా కాచుకొంటూ కూతురు అమ్మన్న, కొడుకు కన్నయ్యలతో కాలాన్ని జరగలాడుతూ వుంటాడు. బ్రతికి చెడ్డవాడు. రైతులు తమ శ్రమతో హృదయ రక్తాన్ని పాదు పాదులో పోసి ఫలాన్ని చేకూర్చుతుంటే ఈ శ్రమ ఫలాన్ని గాదెల్లోపోసి, నల్లుల మాదిరి కంఠము పూటుగ తాగి, మత్తిల్లిన ధన, మత, జాతి అహంకారాన్ని పెంచుకొంటూ శాస్త్రి వినోదడోలికల్లో వూగుతూ వుంటాడు. ఒకరు సంఘ వ్యవస్థలో క్రింది అంతస్తు, ఇంకొకరు పై అంతస్తు.
తండ్రి బీదరికం వల్ల మనో వికారం సంకుచితం గాని కన్నయ్య, తండ్రి సంపదలవల్ల వికాసాన్ని యితోధికంగా పొందిన శర్మ, తండ్రిని కనురెప్పలా చూస్తూ, వేళకు కాస్త గంజిపోస్తూ, తండ్రి మీద కించిత్తు వ్యంగ్యంగానైనా మాట పడనీయని అమ్మన్న, తనను తండ్రిచేత గాజుగ్లాసుగా కాపలా కాయించుకుంటూ, తనమీద కించిత్తు మాట పడనీయని చిన్నారి, వీరూ, ఇందులోని పాత్రలు.
అహంకారం – ధన, మత, జాతికి సంబంధించి – మూర్తీభవించింది శాస్త్రిలో, చిన్నారిలో, కాని, శర్మ ఆకులంలో తప్పబుట్టాడు. సంఘదాస్య భావంలో రూపొంది, దానిలోనే శాంతి కుదుర్చుకున్నవాడు రాయడు. అమ్మన్న విషయంలో, కొంత ఆత్మ విశ్వాసమున్న పిల్ల, అంతకన్నా కవి తెలియనివ్వలేదు. కర్మకు ఈ అమ్మాయిని గూడా ముడిపెడతాడేమో ననుకుంటాడు చదువరి. కన్నయ్య వ్యక్తిత్వం గలవాడు, జాతి ధన, మత అహంకారాల్ని, సాంఘిక న్యూనతను సహించేవాడు కాదు చూపరి.
కథలో ప్రయోజనం పొందినవాడే నాయకుడైతే కన్నయ్య కథకు నాయకుడు. కాని, కవి భావనలో నాయకుడు రాయడే. కాని రాయడు కథలో కొంత దూరమే, దర్బారులో హూంకరించినంతవరకే నాయకుడు. తర్వాత ఆ స్థానం శాస్త్రికబ్బింది. చివరకు పాఠకుడు భావించేది మనసులో నిలుపకొనేది, రాయణ్నికాదు, శాస్త్రినే, కవి కథలో చేసిన చమత్కారాల్లో యిదొకటి.
VIII
మామూలుగా తెలుగు కావ్యాల్లో కథకి కవిత్వానికి సమాన గౌరవం జరిగే ఆచారం లేదు. యీ మధ్య కాలంలో సౌందరనందంలో జరిగిందని లోకం అన్నది. రైతు కళ్యాణంలో ఆ సంథానం సరిగా జరిగింది. దీన్ని పాఠకలోకం తప్పక గ్రహిస్తుంది – ధన, మత, జాతి అహంకృతిలో వికారం పొందిన అపరిణత మతులు కొందరు యీసడించవచ్చును. కథ చూస్తూవుంటే, ముసలాళ్ళని చూపాడు గాని, రాయనికీ, శాస్త్రికి భార్యలు లేరా అన్న సందేహం కవి తీర్చదలచుకోలేదు. అవసరమైన పాత్రల్నే ప్రవేశింపజేయటం, ప్రవేశపెట్టిన పాత్రల్ని గూడా అవసరమైనంతవరకే కథలో నాజూకుగా రానివ్వటం తర్వాత వారి వూసే యెత్తకుండా కథను వుచ్ఛస్థితికి తీసుకపోవటం వర్ణనల మోజు, సిద్ధాంతాల విశదీకరణలకై కావ్యాన్ని, కావ్యాత్మని తాకట్టు పెట్టుకోకుండా వుండటం పాత్రల విశిష్టతలకు అపాత్రత జరుగనివ్వకుండా చేయటంలో కవి లోగడ వారి కృతులలో యెచ్చటా లేని శిల్పాన్ని చూపాడు. రైతు సాహిత్యంలో ఒక విశిష్ట కావ్యాన్ని సృష్టించాడు.
కాని, పండితలోకం లక్ష్మయ్యగారిని కొంతకు కొంత ఆడిపోస్తుంది. దానికి వారేమీ భయపడనవసరం లేదు. లోగడ కృతుల్లో లక్ష్మయ్యగారు కేవలం పండితుడుగా వ్రాశారు. పదాలు, పోకడ, గంపెడంత సంస్కృతం, వాడేవారు. చంద్రగిరి దుర్గంలో కొంత సంస్కృతాన్ని తగ్గించారు. కాని వ్యవహారంలో నిత్యం వాడుకలో వున్న మాటలు పదాలు రైతుకళ్యాణంలో వాడినన్ని వారెక్కడా వాడలేదు. పైగా, దస్తరాల వ్యాకరణ నియమాన్ని దాటి, ప్రయోగాల్ని ప్రయోజనం కోసం వాడారు. అయ్యో! మా లక్ష్మయ్య యెంత చెడిపోయాడని పండితులువాపోయినా, అమ్మయ్య! లక్ష్మయ్య మావాడైనాడని సంతోషపడేవారు తండోపలబ్ధిగా వున్నారు. లక్ష్మయ్యగారిట్లా యింకా యెంతమారితే అంతమంచిది.
IX
కావ్యంలో కవి ప్రాయికంగా రసికుడా, రాజకీయవేత్తయా, న్యాయవాదా అని యెవరైనా చూస్తే రసికుడుగానే యెక్కువగా రాణించాడని చెప్పాలి.
చిన్నారిని అమ్మన్న దుబారించినప్పుడు, రాయడు శాస్త్రితో విజ్ఞప్తి చేసేటప్పుడు, దర్బారులో రాయడు శాస్త్రిపై బుకాయించినప్పుడూ కవి పతితజాతుల తరఫున న్యాయవాద వృత్తికి దిగారు. చిన్నారి జాత్యహంకారాన్ని చూపినప్పుడు, శాస్త్రి ధనతత్వాన్ని, ధర్మ సూక్తుల్ని వివరించునప్పుడు, కవి అదే వృత్తిని ప్రత్యర్థి పక్షంలో వాదించాడు. శర్మ ఉపన్యాసంలోనూ, రాయడు మనోవ్యధ పొందునప్పుడూ రాజకీయ నాయకుడుగా కవి కదిలాడు. కాని, కన్నయ్య చిన్నారులు కవికి వంటరిగా దొరికినప్పుడు, కవిలోని రసికుడు ప్రవాహాలు కట్టించాడు. వారి శృంగార ఘట్టంలో కవి చూపిన చిత్రకళ, పదలాలిత్యం, గమనం తూగు, ఇతర సన్నివేశ కళా ధర్మాలు యెన్నో కనబడతై. ఈ కావ్యంలో వున్న మంచి కవిత్వ పద్యాల్లోకల్లా 72 వంతులు ఈ ఘట్టంలో ఉన్నై.
అవి అన్ని త్రిప్పి వ్రాయటం అనవసరం. 99వ పేజీలో కన్నయ్య కోరిన అభయహస్తాన్ని, 100వ పేజీలో, స్వాముల పిల్ల వగైరా మూడు పద్యాలు కళాస్థితిని వుచ్ఛస్థితికి తీసుకుపోయినై. నవమ ఘట్టంలో తిక్కన ఉత్తర, ద్రౌపదులకు విరాటంలో కల్పించిన రససిద్ధి, సూరన్న కళాపూర్ణోదయంలో సరస్వతీ బ్రహ్మలకినుకలో చూపిన రసస్ఫోరకత అమ్మిశెట్టి క్రుమ్మరించాడు.
ఇదీగాక, మరో చమత్కారం. 59వ పేజీలో రైతు రాయనివ్యధలో రైతులోక పదమర్యాద, 120వ పేజీలో శాస్త్రివ్యధలో వైదిక సాంప్రదాయ పద గౌరవం హృద్యంగా చూపాడు.
కావ్యంలో వుపన్యాసాలు ప్రవేశపెట్టిన విశిష్టత అమ్మిశెట్టి చూపాడు. శర్మ రైతుల్ని ప్రబోధిస్తూ లెండో, రండో, కండో అని ప్రబోధించటం కొత్తరకం.

కవి కావ్యగమనంలో ఇటునటు చూపిన ఈ నవ్యత, భవితవ్యంలో యెంతగానో ముందుకు వస్తుంది. కాని, సూటి వుపన్యాసకావ్యాలు విస్తరించిన తర్వాత అన్యాపదేశంగా ఆ ప్రయోజనాన్నే సాధించే కావ్యాలు పుడతై.
X
ఈ కావ్యంలో కవి రైతుకు కళ్యాణం కూర్చాలి. మొదట్లోనే శర్మ, రైతు కొడుకు కన్నయ్యను కళ్యాణమస్తటంచు దీవిస్తాడు. శర్మచేత ఆ మాట మొదట్లో అనిపించటం, తర్వాత శర్మ రైతు విప్లవ ప్రబోధకుడుగా రావటం యితివృత్తాన్ని పెంచటంలో కవి చూపిన చమత్కారం గమనార్హం.
కవిలోని వుద్దేశం, ధన, జాతి, దాష్ట్యాల్ని రూపు మాపాలని, మత గౌరవం, జాతి గౌరవం కొంత ధన గౌరవం మీద ఆధారపడి వుంది. అందుకని, కవి సంఘాన్ని తేరిపార జూచి సమూలంగా విచారిస్తాడు. రైతు విప్లవం జరగాలి. అదీ కథకంతకు మూలం, బొడ్డురాయి. ఆర్థిక వ్యవస్థ మారాలి. శాస్త్రి అహంకారానికి, రాయని దీనస్థితికి కారణం అదే. భూమి దున్నేవాడే భూస్వామి కావాలి. .కవి సూక్ష్మదర్శి గనుక, ఆ నిర్ణయానికి వచ్చాడు. 63వ పేజిలో.
పొలము హలమ్ముతో అలపు పుట్టంగ దున్ని తదీయసారమున్
వెలికిని బిండంగా గలుగు వీరులకే పొలమన్న యప్పుడే
బలుపు వహించుంగాని మఱి బాగుపడం గలదే.......... .....

అన్న నూత్న దృక్పథాన్ని వివరించాడు. అందుకనే, అసలు కావ్యానికి ....రైతు విప్లవం.... అని పేరుపెట్టవలసింది, యెరడ్డుపడ్డారో తెలియదు.

రైతు విప్లవం కావాలంటే, శర్మలాంటి ప్రబోధకులే గాక, అసలు రైతులోకంలోనే తాత్వికంగా మార్పు రావాలి. దాస్యభావం పోవాలి. ఆత్మవిశ్వాసం కుదరాలి. యివన్నీ గ్రహించి, లక్ష్మయ్య నిరోధాన్ని గురించి :
అది ధనాఢ్యుల చెంత నిత్యమ్మతండు
మున్ను మెలంగినకతన సంపన్నమైన
దాస్య భావమ్ము, నేడది తాల్మిరూపు
దొడగి సిద్ధాతమై వాని కిడియె శాంతి

అని అంటూ, తరుణోపాయాల్ని ఆలోచిస్తాడు. భూమిదున్నే వాడే భూస్వామి కావటం ఒకటి, వర్ణాంతర వివాహాలు మరొకటి. యీ రొండూ, కవి కథాసన్నివేశాల్లో ప్రవేశింపజేసి, కథను ప్రయోజ కవిత్వ బాటల్లో నడుపుతాడు. రైతులోకం చైతన్యాన్ని పొంగి వుత్సహపడి, భావ విప్లవాన్ని తేవాలి. దానికై సంఘంలో వున్న పాత వ్యామోహాన్ని  గురించి కవి చింతిస్తూ : -
ఎంత మునుజూపు కలిగియు నేను ఫలము
తెగదు లోకాల హేళన కగడు మనసు
పడిన బాటను బయనించువారు కోట్లు
బాటపడుటకు యత్నించువారు కొలది

అని తన ఆదర్శసిద్ధికున్న నిరోధకాల్ని వాకొంటాడు. దీనికి సిద్ధాంత బలంకోసం, సంఘంలో, దేశంలో, ప్రపంచంలో రెండే జాతులున్నదని, మనం చూచే యీ చిల్లర సరియైనది.
గాదని కవి ప్రబోధిస్తూ....
రెండే జాతులు భూమిలో గలవు పల్లీపట్టణారణ్య భూ
ఖండమ్ముల్ తమ వంచు గార్మికగళగ్రాహ్యమ్ములౌ శ్రీమదు
చ్చండస్వాములజాతి యొక్కటి తదాజ్ఞన్ బస్తులన్ మాడి బ్ర
హ్మాండమ్మోమెడి దీనజాతియొక టీమాత్రమ్మ లే వన్యముల్
అని కవి మార్గదర్శకు డౌతాడు.

ఈ విధంగా కవి, కృతిభర్త వేసిన ప్రశ్నను,
కృతి ముగియించితో మధురకీర్తికి, దావల మెంచితో కళా
గతి మెఱిగించితో రయితుకష్టములన్ వివరించితో ధని
ప్రతతి కుచేష్టలన్ దెగువబాఱి వచించిలో జాతిభేద సం
స్థితి ఘమ దుష్పలమ్ము వివరించితివో తనియింతువో మమున్.
చూపి, కావ్యంలో యీ సమస్యలకు వుచితరీతిని తరుణోపాయాన్ని చూపించాడు.
కవి తన హృదయంలో పరిపక్వంచేసుకున్న సిద్ధాంతాన్ని రంగరించి మనకు వినూత్న గతుల వెలార్చాడు. కవి చేసిన యీ అద్భుత సృష్టికి మనం ఆయనకు తగిన ప్రతిక్రియ చెయ్యాలి! వారి నవ్యసిద్ధాంతానికి తగినంత ప్రచారం వూరూరా తెప్పించటమే!!ri
Originally Tripuraneni Ramaswamy was supposed to write preface but due to death in 1943 he could not fulfil that obligation. Later Avula Gopalakrishna murthy justified that need with this excellent preface .