సరియైన మార్గాన్వేషణ
శ్రీ గౌరిబోయిన పోలయ్య (ఇంకొల్లు, గుంటూరుజిల్లా)గారి
“పిలకరాయుళ్ళు” గ్రంథానికి పరిచయం
యే యుగంలోనైనా చూడండి సాంప్రదాయజ్ఞులకు సాంప్రదాయ వ్యతిరేకులకు వైషమ్యం తప్పదు. ఒకరు సనాతనులైతే (లౌకికార్థంలో) ఇంకొకరు అధునాతనులౌతారు. ఒకరు పూర్వులైతే యింకొకరు నవ్యులౌతారు. యీ వాదన నాలుగు కాలాలపాటు నిలిచింది గనక మమ్ముల్నే నమ్మం వింటారు ఒకరు. పూర్వ విజ్ఞానానికి ఆధునిక విజ్ఞానాన్ని మేళవించాము గనుక మాదే మేలంటారు రెండోవారు.
ఇటువంటి వరిపిడి లేనిదే శోభలేదు. ఆ శోభను ఆకాంక్షించి గూడా దూరంగా వుండేవారు జాస్తి. దానికోసం యుద్ధరంగంలో దిగేవారు తక్కువ. అందులోనూ విజ్ఞాన శాస్త్రీయ దృష్టితో కదిలేవారు మరీ తక్కువ.
...భారతవర్షకో పతివ్రతాకా ఘమండ్ హై... అని ఒక వంగీయుడు. ఆధ్యాత్మిక వాదమే మన విశిష్టతగా చదువుకున్న వాడూ, చదువుకోనివాడూ నోరూరకుండా నుడువుతారు. నాకు మాత్రం ఒక విశిష్టత కనబడుతుంది. పూర్వ భారతంలో వున్న 7,00,000 గ్రామాలకు కొంచెం దూరంలో యేడు లక్షల పల్లెలు ఉండటం మాత్రం విశిష్టతల తాతలాంటిది. ఇక రెండో విశిష్టత, జ్ఞానం పెరగదు అవటం. అందువల్ల ప్రపంచంలో యెవరు యేది యేమూల చెప్పినా యిదంతా మా వేదాల్లోనే వుంది అంటారు. కాని ఆ విషయాన్ని గురించి వారుమాత్రం ముందుగా చెప్పరు. ఇక మూడో విశిష్టత మన సాంప్రదాయాలు మనకు బాగా తెలియవు. అందువల్ల యీ చిక్కులు వచ్చినై యంటారు. తెలియ చెప్పటానికేమీ సరియైన మార్గాన్వేషణ చెయ్యరు. నాలుగోది కర్మభాగానికిచ్చిన ప్రాముఖ్యత జ్ఞాన భాగానికివ్వరు. అంటే ఆచరణ కిచ్చినంత పాత్ర ఆలోచనకివ్వరు. ఫలితం ఆలోచనారహిత ఆచరణ మిగిలిపోవటం. అయిదో విశిష్టత, చెప్పేదానికి చేసేదానికి వున్న వ్యత్యాసం విపరీతంగా వుండటం.
ముఖ్యంగా ఈ విశిష్టభావాల్ని మార్చుకోవటం గాని, మానుకోవటంగాని చెయ్యకపోతే మనదేశానికి మోక్షంలేదు.
అదీగాక ప్రాచ్య సంస్కృతిలోని యెన్నో విషయాలు అబద్ధాలమీద, అసత్యాల మీద ఆధారపడివున్నై. వాటిని దులపాలి. పాత నీరు పోనిది, పాత రక్తం వీడంది క్రొత్తవి రావటానికి సావకాశం లేదు. అందుకని పాత భావాల్ని, ఆ పాత భావాలమీద ఆధారపడి నిలచిన సౌధాల్ని డుల్లిపుచ్చంది క్రొత్తకు తావులేదనే భావంతో వివిధ దేశాల్లో వివిధ రీతుల్లో వుద్యమాలు రేగినై రష్యాలో రేగిన, వుద్యమాన్ని ....నైవిలిస్టు వుద్యమం... అన్నారు. దాని మాదిరి ఉద్యమాలు ఇతర దేశాల్లోనూ వచ్చినై. మన దేశంలో రామమోహనరాయ్ వాళ్ళతో ప్రారంభమై యం.యన్.రాయ్.తో ఉచ్ఛస్థితికి వచ్చిన యీ భావవిప్లవ వుద్యమంలో చిలవలు పలవలు యెన్నోవున్నై.
సాంఘిక విప్లవాభిలాషలో నున్నవారు ఈనాటి పెండ్లి పద్ధతి మార్చాలని, క్రతువులు వర్జించాలని, కేవలం పాతకు పిలకగా మాత్రమే బ్రతకకూడదని అందరూ అంగీకరిస్తారు. సాంఘిక సముద్రంలో భావవిప్లవాన్ని లేవతీయటానికి ఇటువంటి అలలు యెన్నో చేరాలి, ఈ చేరిన అల దానికెంతైన అవసరం. అవసరం అంతస్తును బట్టి వుంటుంది. అవసరం నెమ్మదిగా ప్రయోజనంగా మారుతుంది. ప్రయోజనం వుపయోగంగా మారుతుంది. ఉపయోగం శ్రేయస్సుగా మారుతుంది. అదేగదా కావ్యలక్షణంగా గ్రహించమని పెద్దలు
Avula Gopalakrishna murty`s preface
.చెప్పింది
2 కామెంట్‌లు:
ఆవుల గోపాల కృష్ణమూర్తి గారి రచనల గురించి ఇంత విశదంగా,విస్తృతంగా మాకు అందిస్తున్నందుకు ముందుగా మీకు నా ధన్యవాదాలు.ఈ సందర్భంగా నాదొకసూచన.ఈ వ్యాసాలు ఎప్పుడు రాసారు,సదరు పుస్తకం ఎప్పుడు అచ్చయింది,ఇప్పుడెక్కడన్నా లభిస్తుందా?రచయిత ఇతరవివరాలు ఇలాంటివి ఇస్తే ఇంకా సమగ్రంగా ఉంటుంది.ఈ వ్యాసం శీర్షికను బట్టి చూస్తే ఇది ఇంకొల్లు ఇంకా గుంటూరు జిల్లాలో ఉన్నప్పటిది.అలాగె వ్యాసం ముగింపు దగ్గర కాస్త మార్చండి.
These articles of AGK were compiled into book form and published by N.Innaiah after the death of Avula Gopalakrishna Murthy in 1967. The articles are written by AGK as prefaces of various books on various occasions. This book was published under the title: Sahityam lo auchityam.
That book is not availble now but may be traced in libraries.
కామెంట్‌ను పోస్ట్ చేయండి