మానవీయుని మాటలు
ఎవరైనా నా అభిప్రాయాలతో ఏకీభవింపనివారు హేతుపూర్వకంగా, కారణాన్ని చెప్పే భిన్నాభిప్రాయాలు కావచ్చు. అట్టివారితో నాకు తగువు లేదు.
* * *
ధర్మం యెదుట వ్యక్తుల మధ్య తారతమ్యముండదు. పాలించేవారు, పాలింపబడేవారు అన్న భేదం లేదు.
* * *
న్యాయస్థానాలు లేక ధర్మస్థానాలు ప్రభుత్వచర్యల్లో ప్రజల హక్కులు నిర్లక్ష్యం చేయబడకుండా కాపాడాలి.
* * *
“అది” మావూళ్ళో వుంటేనే మంచి లేకుంటే “కామంచి” అనే వైఖరి లోకంలో ప్రాయికంగా వుంది. ఆవైఖరి నాకు నచ్చదు. మంచికి ప్రాంతీయతలు అడ్డుగోడలు కాజాలవు. అది ఎక్కడైనా వుండొచ్చు.
* * *
మానవుడు వ్యక్తిగా వికాసాన్ని పొంది, భావిసమాజ నిర్మాణంలో పునాదిగా ఉండగలిగిన ఏర్పాట్లను – మనం పరిశీలించి గమనించుకోవాలి.
* * *
పిల్లలు ఎక్కడున్నా పిల్లలే. వారికి వికారాలు లేవు. ప్రాకారాలు లేవు. అంచులు లేవు. పరిధులు లేవు. వారిహృదయాలు కోమలంగా, పేశలంగా వుంటవి.
* * *
లోకం, టక్కు నేర్పెడి కవుల గంటాల వ్రాతాలను తిరస్కరించి, చారిత్రక దృష్టితో, సత్య దృష్టితో చూడటం నేర్చుకోవాలి. వ్యత్యాస దృష్టిపోయి, న్యూనతా భావాలు సమసిపోయి మానవతా విలువలను నిలబెట్టుటకై కృషి ప్రారంభించవలసి ఉంది.
* * *
స్వాతంత్ర్యం అనేది ఆదర్శంకాదు. అనే ఒక ఆదర్శానికి మార్గం మాత్రమే... ఆదర్శనం స్వేచ్ఛ.
* * *
సంఘంలో జరిగే ప్రతివిషయము, ప్రతిసంఘటన మానవుని శ్రేయస్సు కోసమైనదిగా వుండి. ప్రతివిషయానికి మానవుడే కొలమానంగా వుండాలి. మానవుని భవిష్యత్తు నిర్ణయించే హక్కుదారు మానవుడే కనుక, మానవాదర్శమైన స్వేచ్ఛావ్యాప్తికై సర్వప్రణాళికలు దాసోహమనాలి.
* * *
నిలకడగల ప్రజాస్వామ్యం వర్థిల్లాలి అంటే పత్రికా లోకానికి సంపూర్ణ స్వాతంత్ర్యం వుండాలి.
మూకుమ్మడి దృష్టితోగాక, ఏసమస్యను ఆ సమస్యగా విడమరచి చూడగలిగిన మానసిక నైపుణ్యాన్ని, క్రమశిక్షణను యువకులు నేర్చుకోవాలి.
* * *
AGK was known for his aphoristic sayings. Some of them were compiled by his friends .Here is extract from Gurijala Sitaramaiah`s booklet of AGK sayings
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి